మెదక్: మనోహరాబాద్ మండలం కొండాపూర్ పరిధిలోని పారిశ్రామిక ప్రాంతాల్లోని మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ పరిశ్రమలకు మట్టిని తరలిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.