W.G: ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఈనెల 30న కాళ్లకూరు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల దర్శనార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కోసం ఆలయ ఛైర్మన్ అడ్డాల శివరామరాజు పర్యవేక్షణలో క్యూలైన్లు నిర్మిస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆలయ వర్గాలు తెలిపాయి.