ప్రకాశం: కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ నేటితో ముగిసింది. ఈ టోర్నమెంట్లో గెలుపొందిన విజేతలకు MLA, జిల్లా TDP అధ్యక్షుడు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. ఆయన మాట్లాడుతూ.. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయన్నారు. యువతకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించడమే TDP లక్ష్యమన్నారు.