గుంటూరు పశ్చిమ నియోజకవర్గ 28వ డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీలో అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యూపీహెచ్సీ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయన్నారు.