ATP: శింగనమల మండల కేంద్రంలోని శ్రీరంగరాయ చెరువు ఆయకట్టు పరిధిలో ఎమ్మెల్యే బండారు శ్రావణి పర్యటించారు. స్వయంగా పొలాల్లోకి దిగి రైతులతో కలిసి వరి నాట్లు వేస్తూ వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. సాగునీటి కొరతపై రైతులు వ్యక్తం చేసిన ఆందోళనపై స్పందిస్తూ.. ప్రతి ఎకరాకు నీరు అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.