NLG: నిబంధనలకు విరుద్ధంగా యూరియా విక్రయాలు జరిపినందుకు మర్రిగూడలోని ‘మన గ్రోమోర్’ సెంటర్ ఫెర్టిలైజర్ లైసెన్స్‌ను సస్పెండ్ చేస్తూ మునుగోడు డివిజన్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్‌లో స్లాట్ బుక్ చేయని రైతులకు యూరియా విక్రయించినట్లు తనిఖీల్లో తేలిందని అధికారులు తెలిపారు.