NGKL: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై పగబట్టి కాలేశ్వరంపై కక్ష కట్టారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఆదివారం నాగర్ కర్నూల్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన తులం బంగారం, మహాలక్ష్మి పథకం హామీలు ఏమయ్యా యని నిలదీశారు.