జమ్మూకశ్మీర్లో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. పాకిస్తాన్ నుంచి దాదాపు 30 మంది ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఈ హెచ్చరికలతో అప్రమత్తమైన సైన్యం.. డ్రోన్లు, అత్యాధునిక పరికరాలతో సరిహద్దులను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. సరిహద్దు వెంబడి నిఘాను కట్టుదిట్టం చేసి, జల్లెడ పడుతోంది.