SRPT: సూర్యాపేటలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కోసం వైకుంఠ మండపాన్ని విద్యుత్ దీపాలు, పుష్పాలతో సుందరంగా తీర్చిదిద్దారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీ ప్రత్యేక క్యూలైన్లు సిద్ధం చేసింది. రేపు తెల్లవారుజాము నుంచే భక్తులకు దర్శనం కల్పించనున్నారు.