KDP: ఐకమత్యంతోనే సమస్యలు పరిష్కరించుకుందామని పులివెందుల తాలూకా ఈడిగ గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కొండయ్య గౌడ్ అన్నారు. ఆదివారం పులివెందుల పట్టణంలోని మిట్టమల్లేశ్వర స్వామి కళ్యాణమండపంలో గౌడ సంఘ క్యాలెండర్ ఆవిష్కరించి మాట్లాడారు. గౌడ సంఘం బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.