SS: పరిగి మండలంలోని కాలువపల్లి, పరిగి గ్రామాలలో శ్రీ భక్త కనకదాస జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరిగి మండల కన్వీనర్ గోవింద్ రెడ్డి హాజరై ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రామంలో కురుబ కులస్తులు ఐక్యమత్యంతో జీవించాలని కన్వీనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.