NDL: సీఎం సహాయ నిధి ద్వారా పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు అని నంద్యాల ఎంపీ డా. బైరెడ్డి శబరి తెలిపారు. ఆదివారం నంద్యాల పార్లమెంట్ పరిధిలో 47 మంది బాధితులకు రూ.40 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. పేదలకు ‘మీకు నేనున్నాను’ అనే భరోసా ఇచ్చిన సీఎం రుణం తీర్చుకోలేనిదన్నారు.