AP: హోంమంత్రి అనితకు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ప్రశ్నలు సంధించారు. ఫ్లెక్సీల దగ్గర మేకలు బలిఇస్తే కేసు పెడతారా? అని నిలదీశారు. గతంలో చంద్రబాబు, బాలకృష్ణ ఫ్లెక్సీల దగ్గర మేకలు బలి ఇచ్చి రక్త తర్పణం చేయలేదా? అని మండిపడ్డారు. హిందూపురంలో బాలకృష్ణ గెలుపు తర్వాత పదుల సంఖ్యలో మేకలు నరికి తలలతో దండ వేశారని గుర్తు చేశారు.