కోచ్‌గా గంభీర్‌ను తొలగించనున్నట్లు జరుగుతున్న ప్రచారంపై బీసీసీఐ ప్రధాన కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. కోచ్ మార్పు కథనాల్లో ఎంతమాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. అసలు ఇలాంటి పుకార్లు ఎలా పుట్టుకొస్తాయో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. గంభీర్‌పై తమకు పూర్తి విశ్వాసం ఉందని, ఒప్పందం ప్రకారం 2027 ODI WC వరకు ఆయనే కోచ్‌గా కొనసాగుతారని తేల్చి చెప్పారు.