MNCL: మంచి సేవలు ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తింపును తెస్తాయని జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామ ఈవో రాహుల్ అన్నారు. జన్నారం మండల తాహసీల్దార్ రాజ మనోహర్ రెడ్డి ఉద్యోగ విరమణ చేశారు. దీంతో ఆదివారం జన్నారంలో జరిగిన కార్యక్రమంలో తాహసీల్దార్ దంపతులను ఆయన శాలువాలు కప్పి సన్మానించారు. మండల తాసిల్దారుగా రాజ మనోహర్ రెడ్డి మంచి సేవలు అందించారన్నారు.