ATP: వజ్రకరూరు మండలం తట్రకల్ గ్రామంలో YCP సోషల్ మీడియా యాక్టివిస్ట్ అశోక్ కుమార్ అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వైసీపీ నాయకులు అశోక్ కుమార్ భౌతికకాయానికి నివాళులర్పించారు.