సంగారెడ్డి: మైనర్ అమ్మాయిల జోలికి వెళితే కఠిన చర్యలు తప్పవని కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి ఆదివారం హెచ్చరించారు. ప్రస్తుత సమాజంలో యువత చిన్న,పెద్ద తేడా లేకుండా మైనర్ అమ్మాయిల జోలికి వెళ్ళడం, మాయ మాటలు చెప్పి వెంట తీసుకెళ్లడం చేస్తున్నారని తెలిపారు. ఎవరైనా మైనర్ అమ్మాయి జోలికి వెళితే POCSO చట్టం కింద జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుందని చెప్పారు.