KMM: తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో ఈ నెల 30న నిర్వహించే సీపీఎం డివిజన్ వర్క్ షాప్ను జయప్రదం చేయాలని మండల కార్యదర్శి కొమ్ము శ్రీను అన్నారు. ఆదివారం తిరుమలాయపాలెంలో సీపీఎం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పాల్గొంటారని చెప్పారు. ఈ వర్క్ షాప్లో పలు అంశాలపై చర్చించడం జరుగుతుందన్నారు.