NZB: ప్రభుత్వం పీఆర్సీని వెంటనే ప్రకటించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ డిమాండ్ చేశారు. నగరంలోని ఎస్టీయూ భవన్లో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఇప్పటికే పీఆర్సీ సమయం రెండేళ్లు పూర్తయిందని ఆయన పేర్కొన్నారు. గతంలో ప్రకటించిన విధంగా ఈనెల నుంచి ఇస్తామన్న డీఏను వెంటనే ఇవ్వాలన్నారు.