PPM: పరిసరాల పరిశుభ్రతో రోగాలు దరి చేరకుండా ఉంటాయని జిల్లా ఎన్.సీ.డీ అధికారి డాక్టర్ టీ. జగన్ మోహనరావు పేర్కొన్నారు. బూర్జ గ్రామంలో సర్పంచ్ గుజ్జల. దాసు ఆధ్వర్యంలో ఆదివారం పారిశుధ్య నిర్వహణ ప్రక్రియ చేపట్టారు. రహదారికి ఇరువైపులా ఉన్న చెత్తా, చెదారం, వ్యర్థాలు, తుప్పలు యంత్రాలతో తొలగించారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉండాలి అన్నారు.