GNTR: చిలకలూరిపేట హైవేపై చౌడవరం సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. ద్విచక్ర వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు ప్రకాశం జిల్లా గంగవరం తాళ్లూరు మండలానికి చెందిన చాట్ల నాని, చాట్ల అభిషేక్‌గా గుర్తించారు.