TG: కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టుపై పగ పట్టిందని.. కాళేశ్వరంపై కక్ష కట్టిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. రెండేళ్లలో పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో తట్టెడు మట్టి ఎత్తలేదని తెలిపారు. 90 శాతం పూర్తయిన ప్రాజెక్టును.. ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నించారు. పాలమూరుకు అన్యాయం చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు.