NLG: చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంతోపాటు మండలంలోని వివిధ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను ఆ పార్టీ శ్రేణులు ఆదివారం నిర్వహించారు. పార్టీ జెండాలను ఎగరవేయడంతో పాటు కేక్‌లను కట్ చేశారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు పార్టీ పరంగా గ్రామాల్లో ఇదే తొలి కార్యక్రమం కావటంతో వారు ఉత్సాహంగా పాల్గొన్నారు.