కృష్ణా: చల్లపల్లి మండలం లక్ష్మీపురం పంచాయతీ రామానగరంలో అగ్నిప్రమాద బాధితురాలు వెలగం అనురాధకు రెడ్ క్రాస్ ప్రతినిధులు సహాయం చేశారు. ఆదివారం అనురాధకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ డీ.ఆర్.కే ప్రసాద్ రూ.5వేలు ఆర్థిక సహాయం, డిస్ట్రిక్ట్ బ్రాంచ్ ద్వారా వంటపాత్రలు, హెవీ టార్పాలిన్, సబ్ బ్రాంచ్ ద్వారా నిత్యావసర సరుకులు అందచేశారు.