మెదక్: మత్స్య కార్మికుల ఉపాధి కోసం ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రక్రియ ఎంతో దోహదపడుతుందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం నియోజకవర్గం లోని హత్నూర మండల కేంద్రంలోని పెద్ద చెరువులో ఉచిత చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చెరువుల్లో వదిలిన చేపలు కొద్దిరోజుల తర్వాత అవి ఉత్పత్తి చెంది, కార్మికుల జీవనోపాధికి ఉపయోగపడతాయన్నారు.