తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌తో ప్రేమకథా సినిమాను తెరకెక్కించాలనేది తన డ్రీమ్ అని దర్శకురాలు సుధా కొంగర చెప్పింది. తనకు లవ్‌స్టోరీలంటే ఇష్టమని, పూర్తిస్థాయి ప్రేమకథను తెరకెక్కించాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నానని తెలిపింది. ఇప్పటికే తన దగ్గర కథ ఉందని, దాన్ని డెవలప్ చేయాలని పేర్కొంది. అంతేకాదు అలసిపోయానని, అందుకే త్వరగానే రిటైర్ కావాలనుకుంటున్నానని తెలిపింది.