దేశంలో మలేరియా కేసుల్లో రికార్డు స్థాయిలో 97 శాతం తగ్గుదల నమోదైనట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. అతి త్వరలోనే భారత్ మలేరియా నుంచి విముక్తి పొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. డెంగ్యూ మరణాల రేటును 1 శాతానికి తగ్గించగలిగినట్లు పేర్కొన్నారు. అలాగే దేశంలో ప్రసూతి మరణాల సంఖ్యను కూడా 25 శాతానికి తగ్గినట్లు చెప్పారు.