PLD: జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కృత్తికా శుక్లా తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదుల కోసం ‘మీకోసం’ కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అర్జీదారులు నేరుగా కలెక్టరేట్‌కు రావడంతో పాటు Meekosam.ap.gov.in ద్వారా లేదా 1100 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలను తెలపొచ్చన్నారు.