KNR: హుజురాబాద్ డివిజన్లో చైనా మాంజాను పూర్తిగా నిషేధించామని ఏసీపీ మాధవి తెలిపారు. ప్రజల భద్రత, పక్షుల సంరక్షణ, పర్యావరణ రక్షణ కోసం నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తున్నామని చెప్పారు. చైనా మాంజాను అమ్మినా, కొన్నా లేదా ఉపయోగించినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడైనా విక్రయించిన లేదా నిల్వ ఉన్నట్లు కనిపించిన 8712670733 సంప్రదించలన్నారు.