NTR: వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన గౌసియా జామియా మసీదు ప్రారంభోత్సవ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మతసామరస్యమే భారతదేశానికి నిజమైన బలమని పేర్కొన్నారు. అన్ని మతాలూ మానవతా విలువలు, శాంతి, సోదరభావాన్ని బోధిస్తాయని తెలిపారు.