NZB: కమ్మర్ పల్లి మండలంలోని హాసకొత్తూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థిని రోషిత రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అరుణ శ్రీ ఆదివారం తెలిపారు. ఇటీవలే జిల్లా కేంద్రంలో జరిగిన హ్యాండ్ బాల్ సెలక్షన్స్ పోటీలలో విద్యార్థిని రిషితను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారని వెల్లడించారు.