BDK: అశ్వాపురం మండల కేంద్రంలో రోడ్డు డివైడర్ నిర్మాణ పనులు ఆలస్యం కారణంగా రోడ్లు అస్తవ్యస్తంగా మారాయని స్థానిక నాయకులు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇవాళ అధికారులతో మాట్లాడి విస్తరణ పనులు కొనసాగించారు. దీంతో అశ్వాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ సదర్ లాల్, ఉపసర్పంచ్ ప్రకాష్ రావులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.