W.G: తణుకులో జనవరి 23 నుంచి 25 వరకు జరిగే బాలోత్సవం పిల్లల సంబరాలు పోస్టర్లను ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆదివారం ఆవిష్కరించారు. వ్యాసరచన, పద్యం – భావం, క్విజ్, తెలుగులో మాట్లాడటం, మ్యాప్ పాయింటింగ్, మెమరీ టెస్ట్ చిత్రలేఖనం తదితర కార్యక్రమాలు జరుగుతాయన్నారు. హైస్కూల్ & ప్రైవేటు పాఠశాలల నుంచి సుమారు 4,000 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటారన్నారు.