ATP: బ్లడ్ క్యాన్సర్ బారిన పడిన 12 ఏళ్ల బాలుడికి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అండగా నిలిచారు. మంత్రి లోకేష్ సహకారంతో రూ.12 లక్షల సాయం అందించి చికిత్స చేయించారు. బెంగళూరులో ఆపరేషన్ విజయవంతం కావడంతో, బాలుడి తండ్రి ఎమ్మెల్యేను కలిసి కన్నీటితో కృతజ్ఞతలు తెలిపారు. తమ బిడ్డ ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యే రుణం తీర్చుకోలేమని అతను ఉద్వేగానికి గురయ్యారు.