E.G: బిక్కవోలు మండలం మెళ్లూరు, ఆరికరేవుల గ్రామాల్లో ధనుర్మాసం సందర్భంగా ఆదివారం హరిదాసుల సందడి నెలకొంది. అక్షయపాత్ర ధరించి హరినామస్మరణ చేస్తూ హరిదాసులు ఇంటింటికీ తిరిగి బియ్యాన్ని సేకరిస్తున్నారు. సంక్రాంతి సమీపిస్తుండటంతో మహిళలు వాకిళ్లను రంగురంగుల ముగ్గులతో అందంగా అలంకరిస్తున్నారు. గ్రామాల్లో పండగ వాతావరణం కనిపిస్తోంది.