NLG: చండూరులో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం నిర్వహించారు. మండల అధ్యక్షుడు కోరిమి ఓంకారం, మున్సిపల్ అధ్యక్షుడు అనంత చంద్రశేఖర్ గౌడ్ పార్టీ పతాకాలను ఆవిష్కరించి మిఠాయిలు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం అందించడంతో పాటు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తోందని కొనియాడారు.