KRNL: గోనెగండ్లకు చెందిన కౌలు రైతు కురువ ఎల్లప్పకు చెందిన బర్రె గత రెండు రోజుల కిందట తప్పి పోయింది. దీంతో బర్రెల పెంపకం పైనే ఆధారపడి జీవిస్తున్న ఎల్లప్ప ఆదివారం తీవ్ర మనోవేదనకు గురయ్యారు. బర్రె విలువ రూ.50 వేలు ఉంటుందని, ఎవరైనా ఆచూకీ చెప్తే రూ.10 వేల పారితోషికాన్ని ఇస్తానన్నారు. అటు, ఓ వైపు పండించిన పంటలకు ధరలు లేక నష్టపోతున్నామని వాపోయారు.