NZB: ఆర్మూర్ మండలం గోవింద్ పేట్ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో 1988-89 సంవత్సరం 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 37 సంవత్సరాల తర్వాత కలుసుకున్న స్నేహితులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని, యోగక్షేమాలు తెలుసుకున్నారు. తమ చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకుంటూ, స్నేహితులతో కలిసి ఆనందంగా గడిపారు.