HYD: తెలంగాణ పోలీస్ శాఖలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. జీహెచ్ఎంసీ పునర్విభజన నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లను 12 జోన్లుగా విభజిస్తున్నారు. హైదరాబాద్ పరిధిలోకి శంషాబాద్ ఎయిర్పోర్ట్, రాజేంద్రనగర్ జోన్లు రానున్నాయి. సైబరాబాద్లో శేరిలింగంపల్లి, కూకట్పల్లి, జోన్లు ఉండగా, రాచకొండలో ఎల్బీనగర్, మల్కాజ్గిరి, ఉప్పల్ జోన్లు ఏర్పాటవుతాయి.