NLR: ఉదయగిరిలోని రజక వీధిలో భార్య తిరుపతమ్మపై భర్త గురవయ్య ఆదివారం అనుమానంతో కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తిరుపతమ్మ గొంతుపై గాయమైంది. వెంటనే ఆమెను ఉదయగిరి ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.