TG: వరుస సెలవుల నేపథ్యంలో మేడారంలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. మహా జాతరకు ముందే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి సమ్మక్క-సారలమ్మలకు తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో పస్రా-మేడారం మధ్య వాహనాల రద్దీ పెరిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భక్తుల రద్దీని నియంత్రించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.