KNR: చిగురుమామిడి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు, ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.