MDCL: GHMC మేడ్చల్ సర్కిల్‌కు నూతన డిప్యూటీ కమిషనర్‌గా సుధాంశు బాధ్యతలు చేపట్టారు. సర్కిల్ పరిధిలో సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు చేపడతానని డిప్యూటీ కమిషనర్ తెలిపారు. సర్కిల్ పరిధిలోని సమస్యలు ప్రజలు తన దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. మునుపు మేడ్చల్ సర్కిల్ DCగా పనిచేసిన చంద్రప్రకాష్ బదిలీ అయ్యారు.