KRNL: మద్దికెర గ్రామానికి చెందిన సురేందర్, మీనా కుమారుడు లక్ష్మీకాంత్ (7వ తరగతి), శ్రీవిద్యా సాయి పాఠశాలలో చదువుతున్నాడు. నిన్న ఉదయం పాఠశాలకు వెళ్లిన లక్ష్మీకాంత్ సాయంత్రం అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పరిసరాల్లో వెతికినా సమాచారం లభించకపోవడంతో ఇవాళ వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.