NLR: బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలోని 16 వార్డు పాత కాశీ పాళెం పీర్ల చావిడి వీధిలో ఎస్.డి.పీ.ఐ పార్టీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో వైద్యులు ఆర్థోపెడిక్ నవాజ్ షరీఫ్, జనరల్ ఫిజీషియన్ మధు లేఖా పాల్గొని రోగులకు పలు వైద్య పరీక్షలు చేశారు. వైద్య శిబిరంలో పాల్గొన్న వందమంది రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.