ADB: సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ రాజర్షి షా విద్యార్థులకు సూచించారు. ఈ నెల 8,9 తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించిన ప్రతిష్టాత్మక గ్లోబల్ సమ్మిట్లో జాతీయ స్థాయి INSPIRE అవార్డుకు జిల్లా విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ మేరకు ఆదివారం కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో విద్యార్థులను రాజర్షి షా సత్కరించి అభినందించారు.