SKLM: పాతపట్నం మహేంద్ర జూనియర్ కళాశాలలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఆదివారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే గోవిందరావు హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో బీపీ, షుగర్, థైరాయిడ్ పరీక్షలు వైద్యులు చేశారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ శిబిరాన్ని ప్రజల సద్వినియోగం చేసుకోవాలన్నారు.