కృష్ణా: వేటపాలెం గ్రామానికి చెందిన పోలాబత్తిన వడ్డీ కాసులు మాస్టారు ఆదివారం ఆకస్మికంగా మృతి చెందారు. ఈయన కోడూరులోని పలు పాఠశాలల్లో అధ్యాపకులుగా పని చేశారు. అనారోగ్య సమస్యల కారణంగా ఆకస్మికంగా మృతి చెందారని ఆదివారం మధ్యాహ్నం అంతిమ యాత్ర జరుగుతుందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. వడ్డీ కాసులు మాస్టారు మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.