KMM: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాలో పలు విద్యుత్ సబ్ స్టేషన్లను ప్రారంభించి, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతులకు ఉచిత సరఫరాను కొనసాగిస్తామని పేర్కొంటూ, ఏప్రిల్ నుంచి కొత్తగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు.