విజయనగరం పట్టణం 30వ డివిజన్ (ధర్మపురి)లో ఏర్పాటు చేసిన “డిజి-లక్ష్మి – కామన్ సర్వీస్ సెంటర్” ను ఆదివారం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మెప్మా ద్వారా అమలు చేస్తున్న డిజి-లక్ష్మి పథకం పట్టణ పేద మహిళలకు డిజిటల్ నైపుణ్యంలో శిక్షణ ఇచ్చి, స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రూపొందించబడింది అన్నారు.